కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో గురువారం పిల్లల దత్తత సహాయ కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సూపరిండెంట్ డాక్టర్ దశరథ మాట్లాడుతూ, చట్ట వ్యతిరేకంగా పిల్లలను దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవారు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పూజ, ఎన్జీవో వెంకటేష్ పాల్గొన్నారు.