కోదాడ పట్టణంలోని నయానగర్ లో సుమారు 50 మంది బాలబాలికలు హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహభావాన్ని ప్రదర్శించారు. పెద్దల పర్యవేక్షణలో సురక్షితంగా జరిగిన ఈ వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. చిన్నారుల కేరింతలతో ఆ ప్రాంతం కళకళలాడింది.