కోదాడ బాప్టిస్ట్ చర్చిలో చిల్డ్రన్ సమ్మర్ విబిఎస్ క్యాంప్

కోదాడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన చిల్డ్రన్స్ సమ్మర్ విబిఎస్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ క్యాంప్‌లో చిన్నపిల్లలకు ఎండాకాల జాగ్రత్తలు, ఆరోగ్యం, చదువు ప్రాముఖ్యత, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నాట్యాలు, స్టీఫెన్ పాల్ పప్పెట్ షో పిల్లలను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరి రోజున మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, మాజీ కో ఆప్షన్ సభ్యులు జానకి యేసయ్య, కాంగ్రెస్ నాయకులు గుండె పంగు రమేష్, పీఆర్ టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొల్లి కొండ కోటయ్య, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు జగ్గూ నాయక్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు రాంబాబు, మైక్రో ఆర్టిస్ట్ ఏనుష్ హాజరై పిల్లలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్