సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యం కోదాడ బస్టాండ్ లో చలివేంద్రం

వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస రావు అన్నారు. గురువారం కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రయాణికులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నాగ మణి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్