కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ శనివారం చిలుకూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యశోద ట్రస్ట్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాల ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యశోద ట్రస్ట్ హాస్పటల్ యజమానీ కాసాని దశరథ, గ్రామ శాఖ అధ్యక్షులు సోందుమియా, కొడారు బాబు, కడియాల వెంకటేశ్వర్లు, వట్టి కోటి నాగయ్య, గరినే శేషగిరిరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.