స్వాతంత్ర సమరయోధులు ఉమ్మడి నల్గొండ జిల్లా సీపీఐ మాజీ కార్యదర్శి దొడ్డ నారాయణరావు మృతి సీపీఐ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో మృతి చెందిన దొడ్డా నారాయణ రావు అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు. పాడే మోసి పార్టీ నాయకునికి వీడ్కోలు పలికారు. దొడ్డాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.