కోదాడలో తెర సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో ఆదివారం సినీ సందడి నెలకొననుంది. వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరీలియోకు కళా పురస్కారం, జానపద వాగ్గేయకారుడు చింతల యాదగిరికి సాహితీ పురస్కారం అందజేయనున్నారు. ఫోక్ సింగర్ శిరీష, గాయని దామిని చింతల, యాంకర్ సుజశ్రీ, గాయకులు శ్రీపాల్, భిక్షు నాయక్, సినీ హీరో జెమినీ సురేష్, దర్శకుడు ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొని వినోదాన్ని పంచునున్నట్లు తెర సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు తెలిపారు.