లైన్ ఇన్‌స్పెక్టర్ నాదెళ్ల కు పౌర సన్మానం....

కోదాడం గ్రామంలో సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ నాదెళ్ల బాలకృష్ణకు రైతులు, ప్రజల ఆధ్వర్యంలో పౌర సన్మానం జరిగింది. ఇటీవల శ్రమశక్తి అవార్డు అందుకున్న బాలకృష్ణను సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య శాలువాతో సత్కరించారు. 2024 వరదల సమయంలో విద్యుత్ సమస్యలను బాలకృష్ణ త్వరితగతిన పరిష్కరించి రైతుల మన్ననలు పొందారని, విద్యుత్ వినియోగం, బకాయిల చెల్లింపులపై రైతులకు అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్నారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకరశెట్టి కోటేశ్వరరావు, ఇర్ల సీతారామరెడ్డి, వరాల్‌రెడ్డి, జాబిశెట్టి నాగప్రసాద్, కృష్ణయ్య, ఎర్రకొండలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్