అడ్లూరులో కాంగ్రెస్ వర్గాల ఘర్షణ!

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరులో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం గ్రామసభలో జరిగిన దాడిలో 13 మందిపై కేసు నమోదైంది. మంగళవారం రాత్రి, గ్రామ సర్పంచి గువ్వల శిరీష మామ గువ్వల రామకోటయ్యపై ఉప సర్పంచ్ భర్త కొండలు, మరో 15 మంది కలిసి రహదారిపై కాపుకాసి దాడి చేశారు. ఈ దాడిలో రామకోటయ్యకు తీవ్ర గాయాలవడంతో మొదట కోదాడ ప్రభుత్వాసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్