సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీలో గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ నిధుల దుర్వినియోగంపై ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ భర్త, ఆమె మామ అనుచరులు కలిసి ఉపసర్పంచ్, వార్డు సభ్యులపై దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇరు వర్గాలు కాంగ్రెస్‌కు చెందినవారే కావడంతో పార్టీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.