కోదాడ పట్టణంలోని ఖేలో ఇండియా కబడ్డీ అకాడమీ క్రీడాకారిణి, కేఆర్ ఆర్ కళాశాల విద్యార్థిని శ్రీజ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీనియర్స్ మహిళా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా కేఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ హడస రాణి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహ రావులు శ్రీజను పుష్పగుచ్చాలతో సన్మానించి, క్రీడలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం యువతకు ఆదర్శమని కొనియాడారు. శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.