కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 31వ వార్డు కౌన్సిలర్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు), 11వ వార్డు కౌన్సిలర్ దేవరపల్లి మల్లేశ్వరిలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌడం హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అంకితభావంతో పనిచేసి వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.