ఆదివారం కోదాడలోని కోదండ రామస్వామి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిందని తెలిపారు. నాగుబండి వీరయ్య-భద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.