కోదాడ పట్టణంలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేహా నాజ్ విజయం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ వైస్ చైర్మన్ ఎం.ఏ. జబ్బార్ విస్తృతంగా ప్రచారం చేశారు. వార్డులోని ప్రతి వీధిలోనూ పర్యటిస్తూ ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిజమైన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వార్డు సమగ్ర అభివృద్ధికి నేహా నాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.