సూర్యాపేట జిల్లా కోశాధికారి వెంకటయ్య, జిల్లా కార్యదర్శి డి లాలు మాట్లాడుతూ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్ యుటిఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మంగళవారం మోతే మండలంలోని ఉర్లుగొండ ప్రాథమిక పాఠశాలలో యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేందర్, కోశాధికారి శ్రీను, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ యాదయ్య, కాంప్లెక్స్ కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.