కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు సోమవారం కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన ధరణి హాస్పిటల్‌ను ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తేవడం అభినందనీయమని, నగరాలకు ధీటుగా కోదాడలో ఆధునిక వైద్య సదుపాయాలు రావడం సంతోషకరమని ఆమె అన్నారు. వ్యాపార ధోరణి కాకుండా సేవాభావంతో పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, వైద్యులు పాల్గొన్నారు.