కోదాడ పట్టణంలోని యర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ తహసిల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. భారతీయ సంస్కృతిలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యతను వివరించి, గోరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోశాలల అభివృద్ధి, గోపూజలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.