కోదాడలో సీపీఐ ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ కాలనీ, టీచర్స్ కాలనీ, ఉత్తమ్ పద్మావతి నగర్ లలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విమర్శించారు. పెట్రోలు, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కె లతీఫ్, గోపీనాయక్, క్రాంతి, జానీ లింగయ్య, బాల్ మియా తదితరులు పాల్గొన్నారు.