సూర్యాపేట జిల్లాలో మురుసు తుఫాన్ బీభత్సం: నేలకొరిగిన వరి పంట

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో మంగళవారం మురుసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఈ తుఫాన్ కారణంగా రామలక్ష్మి పురం, గుడిబండ, కాపుగల్లు, కూచిపూడి, తొగరాయ్, గణపవరం తదితర గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. మరో వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట ఇలా నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకుని, తగిన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕