అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామ శివారులోని రోడ్డు మలుపుల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ సొంత ఖర్చులతో గురువారం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులు మలుపుల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.