తొలగిన చీకట్లు.... వీధి దీపాలకు మరమ్మత్తులు

కోదాడ మునిసిపల్ పరిధిలోని 12వ వార్డులో, కౌన్సిలర్ గుండప్పునేని పద్మావతి నాగేశ్వరావు ఆదేశాల మేరకు, స్థానిక డీసీఎం కార్యాలయం నుండి రామిరెడ్డి పాలెం వరకు వీధి దీపాల మరమ్మత్తులు చేపట్టారు. గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్న వార్డు వాసులు కౌన్సిలర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండపునేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్