కోదాడ శ్రీ గుంటి రఘునాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు 17వ రోజు వైభవంగా జరిగాయి. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా, దేవాలయ అర్చకులు నల్లాన్ చక్రవర్తుల రాఘవ చార్యులు, కార్యనిర్వాహణాధికారి తుమ్మల వెంకటచలపతి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.