మునగాల మండలం కొక్కిరేణి ప్రాథమిక పాఠశాలను జిల్లా ఉపాధ్యాయ తనిఖీ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. పాఠశాల కార్యాలయంలోని రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేసి, పాఠశాల నిర్వహణ, విద్యా బోధన తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులతో వివరాలు తెలుసుకున్నారు. తనిఖీ బృందం హెడ్ మధుసూదన్ రెడ్డి, సభ్యులు, పాఠశాల హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.