సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డులు, కేసుల దర్యాప్తు, స్వాధీనం వాహనాలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని, డోర్‌స్టెప్ ఎఫ్‌ఐఆర్ అమలు చేయాలని ఆదేశించారు. పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి గస్తీ నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణకు ఆపరేషన్ రోప్ కొనసాగుతోందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు సహకరించాలని, డ్రగ్స్, గంజాయి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.