సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన మహిళ హత్య ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సైతో కలిసి దర్యాప్తు పురోగతిపై సమీక్షించి, దుకాణదారులను, ప్రత్యక్ష సాక్షులను ఆరా తీశారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షణికావేశాలకు లోనై నేరాలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఉపేక్ష ఉండదని ఎస్పీ హెచ్చరించారు.