కుక్కల కోతుల బెడద నివారించాలి.. న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్

మునగాల మండల ప్రముఖ న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్, యాంటీ వీనం ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రం అందజేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో కుక్కకాటుకు ప్రజలు బలి అవుతున్నారని, అలాగే కోతులు, విష పురుగులు సంచరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెడదను నివారించి, పిల్లలను, వృద్ధులను వీటి బారి నుంచి కాపాడాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్