ఖుర్బానీలో గోవులను వధించ వద్దు.... అబ్దుల్ ఖాదీర్ సాహెబ్

బక్రీద్ సందర్భంగా ఖుర్బానీలో గోవులను వధించవద్దని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. బుధవారం పెద్ద మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. జాతీయస్థాయిలో మత పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు గోవులను ఖుర్బానీ ఇవ్వవద్దని, సర్వమతాలను గౌరవిస్తూ ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని తెలిపారు. భారతదేశం లౌకిక దేశమని, అందరూ అన్నదమ్ముల్లా కలిసి జీవించాలని, బక్రీద్‌ను శాంతియుతంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్