పశు ఔషధాలను విరాళంగా అందజేత

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్‌కు పట్టణ వాసి నిస్సార్ అహ్మద్ అత్యవసర పశు ఔషధాలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య మాట్లాడుతూ, దాతల సహకారం మూగజీవాల ప్రాణరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సైతం ఈ సేవలను ప్రశంసించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్