లక్కవరం ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు చేయూత

అనంతగిరి మండలం లక్క వరం ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు చేయూతనందించారు. కూరపాటి సుగుణ అచ్చయ్య రూ. 15 వేల విలువైన బీరువా, కంకణాల వేలాద్రి రూ. 5 వేల విలువైన లామినేషన్ మిషన్, కుమ్మరి సులోచన రూ. వెయ్యి విలువైన గ్లోబు, కుమ్మరి సుశీల రూ. వెయ్యి విలువైన నోటీస్ బోర్డును బహూకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆళ్ళ నవ్య సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ కూరపాటి సుగుణ అచ్చయ్య, కంకణాల వేలాద్రి, పంచాయతీ కార్యదర్శి త్రివేణి, శ్రీనురెడ్డి, మాజీ ఉపసర్పంచ్ పుల్లారెడ్డి, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు మొక్క రంగయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕