పశువులకు ప్రాణదాతగా మారిన కోదాడ డాక్టర్ పెంటయ్య

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి. పెంటయ్య పశువుల పాలిట దైవంగా మారారు. బుధవారం వీధి కుక్కకు కాలు విరగడంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో కుక్క గుండె ఆగిపోవడంతో, ఆయన వెంటనే సిపిఆర్ (CPR) చేసి ప్రాణాలను కాపాడారు. డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మూగజీవాల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, నిస్వార్థ సేవపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. అరుదైన వైద్యం అందిస్తూ పెంటయ్య అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕