జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కోదాడకు చెందిన హోమియో వైద్యురాలు డా. సేకు నాగ సంయుక్తరాణికి 'వైద్య శిరోమణి–2026' అవార్డును ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దైవజ్ఞ శర్మలు అందజేశారు. సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గానికి చెందిన సంయుక్తరాణి, ఎంఎస్ విద్యాసంస్థల సీఈఓ సేకు శ్రీనివాసరావు కుమార్తె. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను అభినందించారు.