సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ ఎలక్ట్రానిక్స్ మూడో సంవత్సరం విద్యార్థినులు హైదరాబాద్‌లోని ఎల్ఈడీ చిప్ తయారీ పరిశ్రమను శుక్రవారం సందర్శించారు. ఈ పర్యటనలో పరిశ్రమ సీనియర్ అసిస్టెంట్ నరేష్ ఎల్ఈడీ చిప్‌ల ప్రాధాన్యత, తయారీ విధానం, వినియోగంపై విద్యార్థినులకు వివరించారు. కళాశాల అధ్యాపకులు తమేష్ కుమార్, పుష్పలత, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ పర్యవేక్షణలో ఈ క్షేత్రస్థాయి పర్యటన జరిగింది.