జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, సూర్యాపేట జిల్లా కోదాడలో సీనియర్ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావును ఎస్ఆర్ఎం సంకల్ప్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు వైద్య వృత్తి ప్రాధాన్యత, సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలని, ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణతో చదువుకోవాలని, దేశానికి సేవ చేయాలని ఆయన సూచించారు.