సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు నకిలీ సిగరెట్, కాఫీ పొడి రాకెట్‌ను బహిర్గతం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తూ కోదాడలో విక్రయిస్తున్న ముఠాను పట్టణ సీఐ శివశంకర్ నాయక్ వెంకటేశ్వర నగర్‌లో ఆకస్మిక దాడులతో అరెస్ట్ చేశారు. సుమారు రూ. 3 లక్షల విలువైన నకిలీ ‘బ్రూ’ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ ప్యాకింగ్ చేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి సూత్రధారులపై విచారణ కొనసాగుతోంది.