నకిలీ కాఫీ, సిగరెట్ల ముఠా గుట్టురట్టు: రూ.3 లక్షల సరుకు స్వాధీనం

కోదాడ పట్టణంలో నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు మంగళవారం వెంకటేశ్వరనగర్‌లో నిర్వహించిన దాడుల్లో రట్టు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పేరున్న సంస్థల ముద్రలతో నకిలీ ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్