కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని గాంధీనగర్ కాలనికి చెందిన జంపా రాణి, వీధి కుక్కల సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి ముందు తిరిగే ఓ కుక్కకు ఆహారం పెట్టడంతో ప్రారంభమైన ఆమె సేవ, ప్రస్తుతం అనేక వీధి కుక్కల సంరక్షణ వరకు విస్తరించింది. ఒక కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనివ్వడంతో వాటన్నింటినీ ప్రేమగా చూసుకుంటూ ఆహారం, టీకాలు అందిస్తున్నారు. కుక్కల సంఖ్య పెరగకుండా ఉండేందుకు మూడు ఆడ కుక్కలకు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా. పెంటయ్య మాట్లాడుతూ  సంరక్షణ లేని మూగజీవులను సొంత పిల్లల్లా చూసుకుంటున్న జంపా రాణి జంతు ప్రేమ అభినందనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్