సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార రీతిక నాయక్ శనివారం సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రీతిక నాయక్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్లోని వస్త్రాలు నాణ్యతకు పేరుగాంచాయని తెలిపారు. అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికి, విజిల్స్, చప్పట్లతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. దుకాణ యాజమాన్యం నటి రీతిక నాయక్‌కు ఘన స్వాగతం పలికింది.