అనంతగిరి మండలం కొత్తగోల్ తండా గ్రామంలో ఇటీవల మరణించిన సర్పంచ్ బాణావత్ వేణు కుటుంబానికి పార్టీలకు అతీతంగా నాయకులు రూ.1 లక్ష 86 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నూతన సర్పంచుల ఫోరం, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఈ సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గ్రామస్థులు అందరూ ఒక్కటై ఒక కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.