ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందజేత

, కోదాడ నియోజకవర్గంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన హరి, విన్ని, హరీష్‌లకు రిటైర్డ్ గెజిటెడ్ హెచ్‌ఎం ముత్తవరపు రామారావు రూ. 5 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం గురువారం అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరి సమిష్టి కృషి అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను సన్మానించారు.

సంబంధిత పోస్ట్