సూర్యాపేట: అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల, నడిగూడెం మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి అడవికి అంటుకున్నాయి. దీంతో చెట్లు, పొదలు కాలిపోతుండగా, పక్షులు, జంతువులు భయంతో పరుగులు తీశాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అటవీ సంపద నష్టంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్