అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అవగాహన

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ సంతోష్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, అగ్ని ప్రమాదాల సమయంలో డీసీపీ, సీఓటూ పరికరాల వినియోగంపై మాక్ డ్రిల్ ద్వారా వివరించారు. కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అగ్ని ప్రమాదం గమనిస్తే వెంటనే 101కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులు పొలాల్లో గడ్డిని తగలబెట్టవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్