కోదాడలో పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు

ప్రపంచ సాంక్రమిక వ్యాధుల నివారణ దినోత్సవం (జూనోసిస్ డే) సందర్భంగా, సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో జూలై 6న ఉదయం 10 గంటలకు మూడు నెలలు దాటిన పెంపుడు కుక్కలు, పిల్లులకు ఉచిత రేబీస్ నివారణ టీకాలు వేయనున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టణంలోని పెంపుడు జంతువుల యజమానులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ టీకాల ద్వారా రేబీస్ వ్యాధి బారిన పడకుండా తమ పెంపుడు జంతువులను రక్షించుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్