మానవత్వాన్ని చాటుకున్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులు

కోదాడ పట్టణంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో యువకులు అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరమని సమాచారం అందడంతో, దగడు నాగి, పవన్, సన్నీ స్వచ్ఛందంగా రక్తదానం చేసి బాధిత కుటుంబానికి ఊరట కలిగించారు. "రక్తదానం మహాదానం" అనే నినాదాన్ని ఆచరణలో చూపుతూ యువత సమాజానికి ఆదర్శంగా నిలిచారని స్థానికులు ప్రశంసించారు. అవసరమైన సమయంలో స్పందించి ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన యువకుల సేవా తత్వం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యూత్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్