సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కేంద్రంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం మహాసభల అధ్యక్షులు అరవపల్లి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి వందనపు చంద్రమోహన్, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.