మిరపకాయల కూలీకి వెళుతూ తిరిగిరాని లోకాలకు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన తొమ్మిది మంది కూలీలు మిరపకాయలు వేరుటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 ఏళ్ల మహిళా కూలీ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. మిగతా కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్