పరుగు పందెంలో వెంకట్రామ్ పురం యువకునికి గోల్డ్ మెడల్

అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన యువకుడు వద్దేబోయిన సతీష్, నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ 2025 లో 100 మీటర్ల పరుగు పందెంలో 11.58 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీల్లో ఇండియా, నేపాల్, భూటాన్ దేశాలు పాల్గొన్నాయి. నేపాల్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సతీష్ కు నినాదం పత్రిక ఇంచార్జ్ నరేష్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సతీష్ ను గ్రామస్తులు, క్రీడాకారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్