ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలీ

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మంగళవారం తమ్మరలో రబి సీజన్లో ధాన్యం పండించి ఆరబోసుకున్న రైతుల ధాన్యాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. వరి పంట కోతలు ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సరికాదని, వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేనందున రైతులు ఇబ్బందులు పడకుండా అత్యవసరంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్