సూర్యాపేట జిల్లా కోదాడలో, చేతబడి చేస్తున్నారనే నెపంతో తన మనవడు 9 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వృద్ధురాలు అన్నపూర్ణ ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని తన రెండు కోట్ల రూపాయల ఆస్తిని కొడుకు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చానని, నెలకు వచ్చే 38 వేల రూపాయల పింఛన్‌ను కూడా మనవడు తీసుకుంటున్నాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, మనవడికి దేహశుద్ధి చేశారు.