గంట పాటు కీబోర్డు ప్లేచేసి చిన్నారుల గిన్నిస్ బుక్ రికార్డు

నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన సహస్ ప్రిన్స్, సుము సహస్ ప్రిన్స్‌లు కీబోర్డును గంటపాటు నిరవధికంగా వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. ఈ చిన్నారులు సిరిపురం గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. వారి తల్లిదండ్రులు కాంపల్లి సురేష్, మహేశ్వరి తమ పిల్లల ప్రతిభను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్