వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా... కోటిరెడ్డి

కోదాడ 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోల్లా కోటిరెడ్డి తన ఎన్నికల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించి, వార్డులో ముమ్మర ప్రచారం చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అందరికీ చేరాలంటే తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్